హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు

వాహనాల రద్దీ, భారీ వర్షాలతో కుదేలవుతున్న హైదరాబాద్‌ మహానగరంలో పోలీసులు 15 రోజులపాటు ప్రత్యేక ఆంక్షలు విధించారు. జనసమ్మర్ద ప్రాంతాల్లో ఇవి అమల్లో ఉంటాయి. ముఖ్యంగా బస్టాండ్లు, షాపింగ్ మాల్స్,  థియేటర్లు, ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, మద్యం దుకాణాలు, రెస్టారెంట్ల వద్ద నిషేధాజ్ఞలను అమలు చేస్తామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. వినోద ప్రదేశాల్లో, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తక్షణమే భద్రత, సాధారణ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సంబంధిత యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో ప్రజలు క్యూ పద్ధతి పాటించాలని పేర్కొన్నారు. కుండపోత వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ స్తంభించడం, నాలాలు పొంగి ప్రవర్తిస్తుండడం, దీపావళి సీజన్ వస్తుండడం తదితరాల నేపథ్యంలో నిషేధాజ్ఞలను విధించారని భావిస్తున్నారు.

SHARE