పుతిన్ కూమార్తెలపై ఆంక్షలు..ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్ కూమార్తెలపై ఆంక్షలు..ఎందుకంటే?

April 6, 2022

pp

ఉక్రెయిన్ దేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచ దేశాలు వద్దు వద్దు అని చెప్పిన వినకుండా, యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్ దేశం అల్లకల్లోలం అయింది. వందలమంది సైనికులు మృతి చెందారు. కోట్ల సంపద నాశనం అయింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌ను విడిచి లక్షల మంది ప్రజలు కన్నీరు మున్నీరు అవుతూ వేరే దేశాలకు వెళ్లిపోయారు. దీంతో రష్యా వ్యవహరిస్తున్నా తీరుపై ఆగ్రహించిన పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఇప్పటికే స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడంతో పాటు, ఇతర ఆంక్షలను ప్రకటిస్తోంది. ముఖ్యంగా రష్యాకు చెందిన పలు రంగాల్లోని ప్రముఖులు, సంస్థలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా పుతిన్ కుమార్తెలపైనా ఆంక్షలకు ఉపక్రమిస్తున్నారు.

అయితే, పుతిన్ కూతుళ్లకు సంబంధించిన విషయాలు అత్యంత రహస్యంగానే ఉన్నాయి. ఇప్పటివరకూ రష్యా అధ్యక్ష భవనం వారి పేర్లను గాని, పాటు ఫొటోలను గాని అధికారకంగా వెల్లడించలేదు. వివిధ పేర్లను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. అయితే, 2015లో కుమార్తెలకు సంబంధించిన కొన్ని విషయాలను పుతిన్ వెల్లడించారు. ఇద్దరు అమ్మాయిలు రష్యన్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారని, పలు భాషలను మాట్లాడగలరని తెలిపారు.

ఇక, కరోనా వ్యాక్సిన్ తొలిసారి రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించిన సందర్భంలోనూ తన కుమార్తె టీకా తీసుకున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఇక ఇద్దరిలో పెద్ద కూతురు మరియా వారొస్తే సోవా.. రష్యాలో ప్రజారోగ్య విభాగంలోని ఓ అతి పెద్ద ప్రైవేటు కంపెనీలో భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. కాటెరినా మాత్రం మాస్కో స్టేట్ యూనివర్సిటీలో కృత్రిమ మేధకు సంబంధించిన ఓ ఇన్స్టిట్యూట్ ను నడిపిస్తున్నారు. అయితే, రష్యా వెలుపల వారికున్న ఆస్తులపై మాత్రం స్పష్టత లేదు. అయినా, ఈయూ దేశాలు పుతిన్ కూమార్తెల వివరాల కోసం గాలిస్తున్నాయి. వారిపై ఆంక్షలు కఠినంగా విధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.