restrictions within the three commissionerates during Prime Minister Modi's Hyderabad tour.
mictv telugu

ప్రధాని మోదీ పర్యటన… సైబరాబాద్‌లో జూలై 1 నుంచి 144 సెక్షన్ అమలు

June 29, 2022

restrictions  within the three commissionerates during Prime Minister Modi's Hyderabad tour.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు.. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడ వద్దని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. జూలై 1 నుంచి జూలై 4వ తేదీ మధ్య ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది, సైనికులు, హోంగార్డులతోపాటు అంత్యక్రియల కార్యక్రమాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లిమిట్స్ లో నో ఫ్లైయింగ్ జోన్స్ గా గుర్తించిన పోలీసులు… నగరంలో డ్రోన్లను ఎగరేయడంపైనా నిషేధం విధించారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ విషయాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం వెల్లడించారు. శాంతికి విఘాతం కలగడం, ప్రజల ప్రశాంతతకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో.. గాల్లోకి ఎగరేసే పరికరాలపై నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. పోలీస్ ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోద్ చేస్తామని తెలిపారు.