ఫలిస్తున్న గోదావరి బోటు ప్రయత్నాలు.. రేపోమాపో ఒడ్డుకు! - MicTv.in - Telugu News
mictv telugu

ఫలిస్తున్న గోదావరి బోటు ప్రయత్నాలు.. రేపోమాపో ఒడ్డుకు!

October 20, 2019

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును వెలికితీసే పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు నేటితో ఐదవరోజుకు చేరుకున్నాయి. కాకినాడ పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటికే బోటు రెయిలింగ్ లభ్యం కాగా.. త్వరలోనే లాంచీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోటు నది గర్భంలో 38 అడుగుల లోతులో, ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉంది. ధర్మాడి సత్యం బృందం స్కూబా డ్రైవర్లను నది గర్భంలోకి పంపించి ట్రయల్ ఆపరేషన్ ప్రారంభించారు. పది మంది డైవర్లలో ఇద్దరు నది అడుగు భాగంలోకి వెళ్లి పరిస్థితి గమనించారు.

Godavari.

బోటు మునిగిన ప్రాంతంలో నదీ గర్భం ‘V’ ఆకారంలో ఉందని తెలిపారు. అనంతరం ఐరన్ రోప్ తీసుకుని బోట్‌ చుట్టూ కట్టేందుకు డైవర్లు మళ్లీ నీటిలోకి వెళ్లారు. మరో ఇరవై మీటర్లు ఒడ్డు వైపు లాక్కొస్తే.. బోటును సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చని అధికారులు  చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే రేపే బోటు బయటకు వచ్చే అవకాశాలు వున్నాయని అంటున్నారు.