Retired government teacher gifted Rs 19 lakhs saved throughout her life to two sisters
mictv telugu

పొరుగింటోళ్లకు రూ. 19 లక్షలు ఇచ్చేసిన బామ్మ.. ఎమోషనల్ అయిపోయి..

July 12, 2022

Retired government teacher gifted Rs 19 lakhs saved throughout her life to two sisters

తమ పొరుగునే నివసించే ఓ మహిళా టీచర్‌కు నిస్వార్థంగా సేవలు చేయడమే ఆ ఇద్దరి సోదరీమణులకు వరంగా మారింది. వారి నిస్వార్ధమైన సేవలను మెచ్చి ఆ గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్ తాను జీవితాంతం దాచుకున్న రూ.19 లక్షలు గిఫ్ట్‌గా అందించారు. వృద్ధురాలైన ఈ టీచర్ తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బుకు నామినీలుగా ఇద్దరు పొరిగింటివారిని పేర్కొన్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ సిటీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, కోకిలాబెన్ భట్ అనే ఉపాధ్యాయురాలు కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఆమె కృష్ణానగర్‌లోని అభినవ్‌ అపార్ట్‌మెంట్‌లో జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఆమెను ఆప్యాయంగా పలకరించడానికి, ఆరోగ్య సమస్యలు వస్తే సేవలు చేయడానికి కూడా నా అనే వారు ఎవరూ లేరు. అయితే, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న “సోహిని పటేల్, హేమాంగిని షా” అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. కోకిలాబెన్‌ను తల్లిగా భావించి ఆమెకి సేవలు చేస్తూ ఉండేవారు. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెతో చాలా సన్నిహితంగానే మెలిగారు. ఆమెతో బంధం వారు కొనసాగించారు.

కోకిలాబెన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా హేమాంగిని, ఆమె భర్త కలిసి సేవలు చేశారు. ఇక ఆమె చనిపోవడానికి మూడు, నాలుగు ఏళ్లకు ముందు అంటే 2018లో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆ సమయంలో కూడా ఆమె తరుఫు వారు ఎవరూ వచ్చిన పాపాన పోలేదు. రెండేళ్ల తర్వాత అంటే 2020లో కరోనా బారిన పడి కోకిలాబెన్ చనిపోయారు. ఆమె మరణం తర్వాత.. జరిగిన తంతు కార్యక్రమాలు కూడా వారే దగ్గరుండి జరిపించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, కోకిలాబెన్ 2018లోనే సాయిజ్‌పూర్ బోఘా పోస్టాఫీస్‌లోని తన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.19 లక్షలకు సోహిని పటేల్, హేమాంగిని షా భర్త శైలేష్ షాలను నామినీలుగా పేర్కొన్నారు.ఆ విషయం సదరు పోస్టాఫీస్ వారినుండి తెలుసుకున్న వారు అవాక్కయ్యారు.ఆ తరువాత వారు ఆమె పొదుపు ఖాతాలోని డబ్బును క్లెయిమ్ చేశారు.ఈ విషయం తెలిసిన కోకిలాబెన్ మేనల్లుడు కూడా ఆ మొత్తంపై క్లెయిమ్ చేయడంతో విషయం పోలీసు స్టేషన్ కి వెళ్ళింది.దాంతో కేసు కోర్టుకి వెళ్ళింది.అయితే హై కోర్టు ఆ అక్కచెల్లెళ్లకి పాజిటివ్ గా తీర్పు ఇవ్వడంతో ఆ మొత్తాన్ని వారు పొందారు.