తెలంగాణలో కొత్త పార్టీ.. ఆకునూరి మురళి సారథ్యంలో..
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మరింత సందడిగా జరగనున్నాయి. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వెల్లడించారు. గురువారం ఆయన కొత్తగూడెంలో విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లిందని, మార్పు రావాలని అన్నారు. ‘‘అందరూ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకన్నారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికీ డబ్బే ముఖ్యం. ఈ పరిస్థితి మార్చడానికి నేను కొత్త పార్టీ పెడుతున్నాను,’’ అని ఆయన అన్నారు.
మురళి ఇటీవలే ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మురళిని కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన్యం లేని స్టేట్ ఆర్క్వైవ్ విభాగానికి పంపడంతో ఆయన రాజీనామా చేయడం తెలిసింతే. తర్వాత జగన్ ప్రభుత్వం ఆయను సలహాదారుగా నియమించుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో మురళి కొత్త పార్టీ ఎలా ఉంటుందనే రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.