కరోనా మారణకాండ.. నిమిషానికి ముగ్గురు బలి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా మారణకాండ.. నిమిషానికి ముగ్గురు బలి

June 29, 2020

survey

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా దెబ్బకి గత మూడు నెలలుగా ప్రపంచం స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటికి పైగా కరోనా కేసులు నమోదుకాగా.. ఐదు లక్షలకు పైగా కరోనా బారిన పడి మరణించారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆయా దేశాలు విధించిన లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నాయి.

కరోనాపై ఎన్నో సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. తాజాగా రీయూటర్స్ సంస్థ చేసిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం కరోనా కారణంగా నిమిషానికి సగటున ముగ్గురు చనిపోతున్నారని వెల్లడించింది. జూన్ 1 నుంచి 27 వరకు నిత్యం దాదాపు 5 వేల మంది కరోనా కారణంగా మరణించారు. అంటే.. ప్రతి గంటకు 196 మంది.. 18 సెకన్లకు ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా చనిపోయిన వారిలో 25 శాతానికి పైగా మరణాలు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో నిత్యం 40 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాతో పాటు బ్రెజిల్, భారత్‌లలో పెరుగుతున్న కేసులు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తోంది.