టీడీపీ-బీజేపీ కలయిక అపవిత్రం - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ-బీజేపీ కలయిక అపవిత్రం

October 26, 2017

టీడీపీ నుంచి దాదాపు ఉద్వాసనకు గురైన రేవంత్ రెడ్డి… ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. అధినేత చంద్రబాబు దేశంలోని సమయంలో తనపై చర్యలు ఎలా తీసుకుంటారని నిలదీశారు. ‘చంద్రబాబు నాపై నమ్మకం ఉంచారు.

ఆయన లేనప్పుడు ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే దుర్మార్గమే  అవుతుంది.. నన్ను పదవుల నుంచి తప్పించినట్లు చంద్రబాబు నాకు స్వయంగా చెప్పలేదు’ అని రేవంత్ అసెంబ్లీ వద్ద విలేకర్లతో అన్నారు. టీడీఎల్పీ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల నుంచి తనను తప్పించారన్న వార్తలపై ఆయన స్పందించారు.  తనను ఈ పదవుల నుంచి ప్పించాల్సిన అవసరం కేసీఆర్‌కు తప్ప మరెవరికీ లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరికపై మాట్లాడుతూ.. చాలా అంశాల్లో  ఆ పార్టీతో కలసి పనిచేశానని చెప్పారు. టీఆర్ఎస్ ను దుయ్యబడుతూ.. ‘తెలంగాణకు గులాబీ చీడ పట్టింది. దాన్ని వదలగొట్టడానికి రకరకాల మందులు కొడతాం’ అని అన్నారు. మరోపక్క.. గోల్కండ హోటల్లో జరిగిన టీడీపీ, బీజేపీ నేతల సమావేశానికి వెళ్తానన్న రేవంత్ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు.