రేవంత్ గుడ్‌బైపై బాబుకు అమిత్‌షా ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ గుడ్‌బైపై బాబుకు అమిత్‌షా ఫోన్

October 28, 2017

టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెంటనే స్పందించారు. మిత్రపక్ష అధినేత అయిన చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రేవంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి బయటికి వెళ్లకుండా చూడాలని, కాంగ్రెస్‌లో చేరకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేశారు.

తెలంగాణలో పొత్తుల గురించి వివరంగా మాట్లాడుకుందామని చెప్పారు. ఈ సందర్భంగా బాబు.. తెలంగాణ బీజేపీ నేతలపై ఫిర్యాదులు చేశారు. ‘మీ పార్టీ వాళ్లు చాలా అతి చేశారు. రేవంత్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నారు. అతని వ్యవహారం ఇక మన చేతుల్లో లేదు’ అని బాబు.. కమలదళపతితో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

రేవంత్ కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుని, బీజేపీ అవకాశాలకు అడ్డంకి మారే చాన్సుంది కనుక అమిత్ షా.. రేవంత్‌ను టీడీపీని వీడకుండా చూడాలని బాబుకు చెప్పినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.