సందడిగా రేవంత్ ఆత్మీయ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

సందడిగా రేవంత్ ఆత్మీయ భేటీ

October 30, 2017

రేవంత్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో ఆత్మీయ భేటీ నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సమావేశం తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరికపై అధికారిక పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. భేటీకి ముందు రేవంత్ పెద్దమ్మ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి తన హామీని నెరవేర్చినందుకు సోనియా అంటే తనకు గౌరవమని ఆయన పేర్కొన్నారు.

 ఆత్మీయ భేటీ నేపథ్యంలో తెలంగాణ నిఘా పోలీసులు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి చుట్టుపక్కల కాపు కాసి నేతల రాకపోకలను గమనిస్తున్నారు.