రేవంత్ బాహుబలి కాదు పిట్టలదొర - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ బాహుబలి కాదు పిట్టలదొర

October 31, 2017

కష్టపడి సాధించుకున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

‘రేవత్ వ్యవహారం టీకప్పులో తుపానులా చల్లారిపోతుంది. అతడు బాహుబలి కాదు పిట్టల దొర’ అని ఎద్దేవా చేశాడు. ఆయన మంగళవారం టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు ఆమెను పొగుడుతున్నారని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ 60 సంవత్సరాలలో చేయలేని పనులను కేసీఆర్ చేస్తున్నారు. స్వప్రయోజనాల కోసమే రేవంత్ పార్టీ ఫిరాయించారు’ అని విమర్శించారు.  తెలంగాణ తెచ్చుకున్నది గొర్రెలు, బర్రెల కోసమా అన్న రేవంత్ విమర్శలపై స్పందిస్తూ.. ‘చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ బర్రెలు ఉండబట్టే నడుస్తోంది కదా.. కులవృత్తులంటే రేవంత్ కు అంత చులకన ఎందుకు?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ కూ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.