ఆదిలోనే రేవంత్‌కు అపశకునం! - MicTv.in - Telugu News
mictv telugu

ఆదిలోనే రేవంత్‌కు అపశకునం!

October 31, 2017

టీడీపీ వదిలేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డికి ఆదిలోనే అపశకునం ఎదురైంది. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. రేవంత్‌కు ఎడమ చేత్తో స్వీటు తినిపించాడు. రాహుల్ కావాలని అలా చేయకపోయినా ఎడమ చేయి అశుభానికి చిహ్నమని భావిస్తారు కనుక రేవంత్ ఇబ్బందుల వచ్చే అవకాశముందని ఈ ఫొటో చూసిన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే రాహుల్ చాలా సందర్భాల్లో రెండు చేతులనూ వాడుతుంటారని, అనుకోకుండా ఈ ఘటన జరిగిందని మరికొందరు సరిపెట్టుకుంటున్నారు. రాహుల్ తనకు స్వీట్ తినిపిస్తున్న ఫొటోతో పాటు మరికొన్ని ఫొటోలను రేవంతే స్వయంగా ఫేస్ బుక్ లో పెట్టాడు. రేవంత్ వ్యతిరేకులతోపాటు, అభిమానులు కూడా వీటిపై కామెంట్లు చేస్తున్నారు.  ‘టీడీపీని గుండెకోతతో వదులుకుని  కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు.. రాహుల్ గాంధీ ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి..’ అని ఒకరు అన్నారు. ఎడమ చేత్తో మిఠాయి తినిపించడం విషప్రయోగంతో సమానం అని ఇంకొకరు అన్నారు.  ‘ఎడమ చేత్తో నోట్లో స్వీట్ పెట్టాడంటే, మీకు హ్యాండ్ ఇచ్చినట్టే. రాహుల్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదు ’ అని మరొకరు అన్నారు. అయితే ఏదో అనుకోకుండా జరిగినదానికి ఇలాంటి దురభిప్రాయాలను ఆపాదించొద్దని రేవంత్ అభిమానులు కూడా ఎదురుదాడికి దిగారు.