టీడీపీకి రేవంత్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి రేవంత్ రాజీనామా

October 28, 2017

ఊహించినదే జరిగింది. తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీకి శుక్రవారం రాజీనామా చేశారు. తెలంగాణ టీడీపీలో విభేదాలు ముదరడం, పంచాయితీ… అధినేత చంద్రబాబు ముంగిటికి చేరడం తెలిసిందే.

రేవంత్  కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు కూడా కఠినంగా మాట్లాడారు. ఎవరున్నా పోయినా పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. తుది చర్చల కోసం విజయవాడకు రావాలని చెప్పడంతో రేవంత్, తెలంగాణ టీడీపీ నేతలు శనివారం అక్కడికి వెళ్లారు. బాబుతో సమావేశం అయ్యారు. అయితే తనతో ఏకాంతంగా మాట్లాడాలని రేవంత్ బాబును కోరారు. అందుకు బాబు స్పందించలేదు. తర్వాత చూద్దాం అన్నారు. దీంతో ఇక చర్చించేదేమీ ఉండదని భావించిన రేవంత్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. లేఖను బాబు పేషీలో ఇచ్చారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని అందులో పేర్కొన్నారు. బాబు తన ఎదుగుదలకు సహకరించారన్నారు. రాజీనామా లేఖను బాబుకు పంపానన్నారు. అయితే రేవంత్ రాజీనామా తనకు అందలేదని బాబు చెప్పారు.