తెలంగాణ టీడీపీ ఖాళీ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ టీడీపీ ఖాళీ!

October 30, 2017

టీడీపీని వదలి కాంగ్రెస్‌లో చేరనునన్న రేవంత్ రెడ్డి బాటలో వందలాది నేతలు పయనించనున్నారు. వీరంతా మంగళవారం రేవంత్ పాటు ‘హస్తం’ తీర్థం పుచ్చుకునే అవకాశముంది.

సోమవారం ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ మంగళవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన నేతలు ఆయనతోపాటు ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. టీడీపీకి సోమవారం రాజీనామా చేయనున్నట్లు మాజీ మంత్రి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బోడ జనార్దన్‌ తెలిపారు.

 

సీతక్క కూడా రేవంత్  బాట పట్టారు. టీటీడీపీ అధికార ప్రతినిధులు మేడిపల్లి సత్యం, సతీష్ మాదిగ తదిరులు ఆదివారం రాజీనామా చేశారు. ఎవరెవరు కాంగ్రెస్‌లో చేరబోతున్నారో వివరిస్తూ తయారు చేసిన ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుతోంది. వీరిలో పలువు మాజీ ఎమ్మెల్యలేలు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన నేతలు కూడా రేవంత్ బాట పట్టొచ్చని బావిస్తున్నారు.