ఎమ్మెల్యే పదవినీ వదులుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే పదవినీ వదులుకున్నాడు

October 28, 2017

టీడీపీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి కొన్ని గంటలు తిరక్కముందే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాడు. కొడంగల్ ఎమ్మెల్యే పదవిని ఆయన వదులుకున్నాడు. గతంలో ఫిరాంపులను విమర్శించిన తనపై విమర్శలు రాకూడదన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాను పంపారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రేవంత్ విజయవాడ నుంచి కొడంగల్ వెళ్లి తన అనుచరులతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటాడని భావించారు. అయితే ఆయన ఊహంచిన విధంగా సాయంత్రమే రాజీనామా చేశారు. దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు బలమందుకున్నాయి.