రేవంత్ వెంట వీళ్లందరూ... - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ వెంట వీళ్లందరూ…

October 31, 2017

 

టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డి వెంట పలువురు కీలక నేతలు కూడా వెళ్లారు. టీడీపీ నుంచే కాకండా టీఆర్ఎస్ నుంచీ పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లిపోయారు. దీంతో పలు జిల్లాల్లో టీడీపీ దిక్కులేనిదైపోగా, టీఆర్ఎస్ ఖాళీలు త్వరలోనే భర్తీ కానున్నాయి.

టీడీపీ నుంచి వెళ్లినవారు..

సీతక్క, బోడ జనార్ధన్,  వేం నరేందర్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, సత్యం,  అరికెల నర్సారెడ్డి, సోయం బాపురావు, జంగయ్య, హరిప్రియా నాయక్‌, బిల్యా నాయక్‌, శశికళ, రాజారాం యాదవ్‌, పటేల్‌ సుధాకర్‌రెడ్డి, రమేశ్‌ , విజయరమణా రావులు తదితరులు

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వెళ్లిన వారు

దొమ్మాటి, విద్యార్థి, యువజన ఉద్యమనాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, మధుసూదన్‌. వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కార్యక్రమంలో తెలంగాణ ఇంచార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, చిన్నారెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి, యువజన నేత అనిల్ యాదవ్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.