ఎన్ని పార్టీలు మారతావు చిట్టీ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్ని పార్టీలు మారతావు చిట్టీ!

October 31, 2017

విభేదాలతో టీడీపీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి పార్టీలు మారడం కొత్తేమీ కాదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇందులో రేవంత్ టీఆర్‌ఎస్ గులాంబీ కండువా కప్పుకుని, ఆ పార్టీ నేతల పక్కన నిలబడి ఉన్నారు.

పది, పన్నెండేళ్ల కిందటిగా భావిస్తున్న ఈ ఫొటోపై నెటిజన్లు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ‘ఎన్నిసార్లు పార్టీ మారతావు చిట్టీ!’, అని ఒకరు ‘మళ్లీ టీఆర్‌ఎస్ కండువా ఎప్పుడు వేసుకుంటావు కన్నా’ అని మరొకరు అన్నారు. అయితే రేవంత్‌ను ఆయన అభిమానులు గట్టిగా సమర్థిస్తున్నారు. రాజకీయాల్లో రేవంతే కాకుండా చాలా మంది పార్టీలు మారారంటూ టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి వెళ్లిన వారి ఫోటోలను పోస్టు చేస్తున్నారు. మరికొందరు కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పటి ఫోటోలను పోస్టు చేస్తున్నారు. మొత్తానికి ఈ రేవంత్ పాత ఫొటో ఆయన వ్యతిరేకులకు ఇప్పుడో ఆయుధంగా మారింది.