కాంగ్రెస్‌లో చేరుతున్నా: రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్‌లో చేరుతున్నా: రేవంత్

October 30, 2017

టీడీపీని వీడిన రేవంత్ రెండ్డి తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్‌రెడ్డి అధికారికంగా సోమవారం ప్రకటించారు. తన నివాసంలో జరిగిన ఆత్మీయుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

‘కేసీఆర్‌ కుటుంబ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి తన వైపున్న టీడీపీ కార్యకర్తలంత మద్దతివ్వాలని కోరారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రాహుల్‌, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేద్దామన్నారు. కాగా, మంగళవారం ఢిల్లీలో రాహుల్ సమక్షంలో రేవంత్, ఆయన వర్గం నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.