9న రాహుల్ సభలో రేవంత్‌కు తీర్థం! - MicTv.in - Telugu News
mictv telugu

9న రాహుల్ సభలో రేవంత్‌కు తీర్థం!

October 28, 2017

రేవంత్ రెడ్డి టీడీపీకీ, అందులోని పదవులన్నింటికి గుడ్‌బై చెప్పేయడంతో ఇక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే మిగిలి ఉంది. నవంబర్ 9వ తేదీన వరంగల్‌లో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభలో రేవంత్ ఆ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

రేవంత్ ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడైన రాహుల్ తో భేటీ అయ్యారని వార్తలు రావడం తెలిసిందే. రేవంత్ దీన్ని ఖండించినా భేటీ నిజమేనని అందరూ భావిస్తున్నారు. సమావేశం సందర్భంగా.. తనతోపాటు ‘హస్తం’ తీర్థం పుచ్చుకునే  20మంది నేతల జాబితాను ఆయన రాహుల్‌కు అందించారని సమాచారం. రాహుల్‌ నవంబర్‌ రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఒక భారీ సభను నిర్వహించేందుకు టీపీసీసీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ లో దీన్ని నిర్వహిస్తారని, అక్కడే రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావిస్తున్నారు.