నిర్మల్ జిల్లా బాసరలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు పోలీసుల కళ్లుగప్పి బాసర ట్రిపుల్ ఐటీకి రేవంత్ చేరుకున్నారు. కాలి నడకన వచ్చి గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న పోలీసులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల ఆందోళనకు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.