‘కంట్లో కారంపొడి’ ట్రీట్మెంట్‌కు నేను రెడీ : రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

‘కంట్లో కారంపొడి’ ట్రీట్మెంట్‌కు నేను రెడీ : రేవంత్

April 5, 2022

bfb

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో తన మేనల్లుడు ఉన్నాడన్న ఆరోపణలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ‘మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో డ్రగ్స్ ఉండకూడదు. డ్రగ్స్ వాడితే నా మేనల్లుడా, సొంత అల్లుడా, కొడుకా, తమ్ముడా అని చూడను. ధైర్యం ఉంటే ఈడీ, ఎన్సీబీ, డీఆర్ఐల చేత విచారణ చేయించండి. అందరికీ టెస్టులు చేయించండి. ఎవడు పట్టుబడితే వాడికి సూర్యాపేటలో ఓ తల్లి ఇచ్చిన కంట్లో కారంపొడి చికిత్సను ఇప్పిద్దామ’ని వ్యాఖ్యానించారు. అలాగే టీఆర్ఎస్, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ‘నా బంధవులెవరైనా డ్రగ్స్ వినియోగిస్తే నేనే వాళ్ల బట్టలిప్పి నడి బజారులో కొడతా. అంతేకాక, నేనే స్వయంగా వైట్ ఛాలెంజ్‌కు వస్తా. కేటీఆర్, కేసీఆర్, బండి సంజయ్ మీరు రెడీనా’? అంటూ సవాల్  చేశారు.