కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్

October 31, 2017

తెలుగు దేశం పార్టీ నుంచి బయటకి వచ్చిన రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని  కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి రేవంత్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. రేవంత్‌ను టీపీసీసీ   అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్ కుంతియా తీసుకెళ్లారు. రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ  మర్యాద పూర్వకంగా ఆహ్వానించింది.

రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ఏఐఐసీ ముఖ్యనేతలు ఈ రోజు మధ్యహ్నం 3 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు.  తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నేతలు, ములుగు  మాజీ ఎమ్మెల్యే సీతక్క ,వేం నరేందర్ రెడ్డి తదితరులు , రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు…