Revanth Reddy criticized TRS and BJP
mictv telugu

బీజేపీ – టీఆర్ఎస్ కుమ్మక్కు.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

October 19, 2022

Revanth Reddy criticized TRS and BJP

టీపీసీసీ అధ్యక్షుడు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ తరహా రాజకీయాల్లో భాగంగా త్వరలో కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో నియోజకవర్గానికి వస్తారని, కేంద్రం తరపున సీఆర్పీఎఫ్, రాష్ట్రం తరపున పోలీసు బలగాలు రంగంలోకి దిగబోతున్నాయని ఆరోపించారు.

ఈ రెండూ తమ ప్రత్యర్థులపై పరస్పరం కేసులు, అరెస్టులు వంటి చర్యలతో ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టి పోటీలో ఆ రెండు పార్టీలే ఉన్నాయనే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తాయని తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే జరిగిందని, అప్పడు నమోదైన కేసులు ఇప్పుడు ఎక్కడ పోయాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పాము – ముంగిస ఆట ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది మోదీ, అమిత్‌షాలతో చీకటి ఒప్పందం కుదుర్చుకోవడానికేనని విరుచుకుపడ్డారు. బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను చంపేస్తానని బెదిరిస్తున్నారని, అతనిపై ఎన్నికల సంఘం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఎన్నికల్లో దొరికిన డబ్బు ఎవరిదో చెప్పేవారు, కానీ మునుగోడులో కోట్ల డబ్బు దొరుకుతున్నా పోలీసులు ఆ వివరాలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం లేదని నిలదీశారు. ఆడబిడ్డను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.