రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

April 7, 2022

hb

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలి, మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులను ఇంట్లోంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు ధాన్యం కొనుగోలు కోసం సివిల్ సప్లయ్ భవన్ ముట్టడికి కూడా రేవంత్ పిలుపునిచ్చారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు.