ఆర్జీవీ ‘కొండా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి - Telugu News - Mic tv
mictv telugu

ఆర్జీవీ ‘కొండా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి

June 16, 2022

రాయలసీమ రక్త చరిత్ర.. బెజవాడ రౌడీయిజం పై సినిమాలు తీసి కలకలం రేపిన రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు. వరంగల్ కి చెందిన రాజకీయ కుటుంబం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా’ కొండా’ సినిమాని తెరకెక్కించారు. ఈనెల 23 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న వరంగల్ లో జరగనుంది. ఖుష్ మహల్ గ్రౌండ్ లో 18న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆర్జివి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్న తన మిత్రుడు, తెలంగాణ సింహం రేవంత్ రెడ్డికి ‘కొండా’ సినిమా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పారు.