Revanth reddy put new name to Rajagopal Reddy
mictv telugu

రాజగోపాల్ రెడ్డికి కొత్తపేరు పెట్టిన రేవంత్…

August 11, 2022

Revanth reddy put new name to Rajagopal Reddy

కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు కొత్త పేరు పెట్టారు. రాజగోపాల్ రెడ్డి చేష్టలు కామెడీని తలపిస్తున్నాయని, కేఏ పాల్‌లాగా ‘ఆర్‌జీ పాల్’ అని పిలవాలని ఎద్దేవా చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక రానున్న అంచనాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. అక్కడి పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పార్టీ అనుబంధ సంఘాలే కీలకంగా వ్యవహరించాలని కోరారు. కాగా, రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి. సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా అన్ని పార్టీలు భావిస్తున్న మునుగోడు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపై పడతాయన్న విశ్లేషకుల అంచనాతో ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.