జైల్లో తిన్న చిప్పకూడుపై ఒట్టేసి చెబుతున్నా..రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

జైల్లో తిన్న చిప్పకూడుపై ఒట్టేసి చెబుతున్నా..రేవంత్

September 27, 2018

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాను జైలుకు వెళ్లడం ఖాయమన్నట్లు స్వయంగా సంకేతాలిచ్చారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన నోటివెంట అరెస్ట్, జైలు నామినేషన్ వంటి మాటలు వచ్చేశాయి. రేవంత్ ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

ff

‘అన్నీ మంచిగా ఉంటే మళ్లీ వస్తాను. మీతో మాట్లాడ్డం ఇదే చివరిసారి కావొచ్చు. నేను జైలుకు వెళ్తే అక్కడి నుంచే నామినేషన్ వేస్తాను. నన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరంతా నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే హైదరాబాద్ వెళ్తున్నాను. జైల్లోంచే పోటీ చేస్తాను.. నన్ను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీదే. బాగా వినండి.. జైల్లో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నాకేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేంత వరకు నిద్రపోను.. ’ అని ప్రతిన బూనారు. మోదీ, కేసీఆర్‌లు తనను రాజకీయంగా ఎదుర్కోలేకే, ఏమీ చేయలేకనే ఐటీ దాడులు చేయిస్తున్నాని ఆరోపించారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతానని అన్నారు.