టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఆయన ప్రస్తుతం మోపాల్ మీదుగా పర్యటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా బుధవారం నిజామాబాద్‌లోని పాత కలెక్టర్ గ్రౌండ్ లో యువజ న కాంగ్రెస్ నిర్వహిం చిన అర్గు ల్ రాజారాం మెమోరి యల్ హాథ్ సే హాథ్ జోడో ఫుట్బాల్ టోర్నమెంట్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్లేయర్స్‌తో కలిసి కాసేపు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. వారితో సమానంగా పరుగెత్తి ఆటను ఎంజాయ్ చేశారు. ఫుట్బాల్ గేమ్‌లో తనకు ఉండే స్కిల్ ను ఉపయోగించి ఓ గోల్‌ను కూడా కొట్టేశారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు..దానికి కేసీఆర్ ఖేల్ ఖతం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.
రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీబిజీగా ఉండే రేవంత్ రెడ్డి సరదాగా తమతో కలిసి ఆడడంతో ఆటగాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. ఏదో ఆటను ప్రారంభించి వెళ్లిపోవడం కాకుండా తమతో కలిసి రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగడం స్పూర్తినిచ్చిందన్నారు.