Revanth Reddy writes open letter to cadre, says some leaders betrayed party
mictv telugu

కాంగ్రెస్ అభ్యర్థిపై రాళ్ల దాడి.. రేవంత్ రెడ్డి సీరియస్

October 25, 2022

Revanth Reddy writes open letter to cadre, says some leaders betrayed party

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో హీట్ పెంచుతుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ మొదటి నుంచి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. మరికొద్దిరోజులే సమయం ఉన్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై రాళ్లు వేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ దాడిలో స్వయంగా బీజేపీ అభ్యర్థే పాల్గొన్నాడని ఆరోపించారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే పట్టించుకోమా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా అని రేవంత్ అన్నారు.

కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే పార్టీకి వెన్నుపోటు పొడిచారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలనుకుంటున్నాయని అన్నారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్‌లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.