Revanth Reddy,JaggaReddy Meet In TS Assembly Area
mictv telugu

తిట్టుకుంటారు..కలిసిపోతారు సరే..

December 2, 2022

Revanth Reddy,JaggaReddy Meet In TS Assembly Area

మాది తోడి కోడళ్ల పంచాయితీ. మా మధ్య విభేదాలు లేవు. పొద్దున తిట్టుకుంటాం..సాయంత్రం కలిసిపోతాం..ఇవీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈయన ఒక్కరే కాదు అందరు నేతలు పైకి ఇలాగే చెబుతారు. లోపల చేసే రాజకీయం చేసేస్తారు. మైకుల ముందు సారథినే తిట్టేస్తారు. లేదు లేదు కలిసే ఉన్నామంటారు. తిట్టుకుంటారు..కలిసి పోతారు..సరే మరి కదన రంగంలోకి దూకేదెప్పుడు? ఇప్పటికే చాలా వికెట్లు పడ్డాయి.చేతిలో ఉన్న వికెట్లను ఎలా కాపాడుకుంటారు?

కాంగ్రెస్‌లో ఇంతేనా…

తెలంగాణ కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితి ఉంది.రాష్ట్రమంతా కేడర్ ఉంది. చాలా నియోజకవర్గాల్లో రేసులో సత్తా చాటే బలం ఉంది.కానీ వీళ్లను సరైన దారిలో నడిపించే నాయకుడు లేరు. రేవంత్ వచ్చాక పార్టీ పరిస్థితి మారుతుందనుకున్నారు. కానీ ఇప్పడు అలాగే ఉంది. లేచి ఎగిరే కెరటాలు ఎగురుతూనే ఉన్నాయి. పడే వికెట్లు పడుతూనే ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు ఏం చేసినా హైకమాండ్‌కు వదిలేస్తారు.మర్రి శశిధర్ రెడ్డి లాంటి నేతల్ని బహిష్కరించారు. చర్యల విషయంలో కాంగ్రెస్‌లో విచిత్రమైన పరిస్థితి. నాయకుల తీరు అంతే.పైకి మా మధ్య విభేదాలు లేవంటారు.లోపల నడిపి రాజకీయం నడిపేస్తారు.సారథిని ఎలా తిప్పలు పెట్టాలో అలా పెట్టేస్తారు. ఇందులో మాత్రం నో కాంప్రమైజ్

రేవంత్ తర్వాత నేనే…

అసెంబ్లీ ఆవరణలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు.వీళ్లద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. “మాది తోడికోడళ్ల పంచాయితీ.మా మధ్య విభేదాలు లేవు,పొద్దున తిట్టుకుంటాం..సాయంత్రం కలిసిపోతాం.రేవంత్ పాదయాత్రకు మద్దతు ఇస్తారు. రేవంత్ దిగిపోయాక నేనే పీసీసీ చీఫ్ అవుతా”అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఒక్క జగ్గారెడ్డినే ఆ పార్టీలో సీనియర్లు అందరూ ఇలాగే మాట్లాడుతారు. మైక్ పడితే మాత్రం మాటలు ఆగవు.ఎవరైతే నాకేంటి అంటూ పంచ్ లు ఎసేస్తారు. కదనరంగంలోకి దూకేసమయంలో కాదుపోమ్మంటారు.కొన్నిసార్లు కలిసి వచ్చినా ఫలితం తారుమారైతే ఒక్కడిపైకే తోసేస్తారు. మొన్న మునుగోడులో జరిగింది.

కేడర్ ఉన్నా

అందుకే కేడర్ ఉన్నా కాంగ్రెస్ రేసులో ఉండలేకపోతోంది. ఎన్నో ఆశలతో పీఠమెక్కిన సారథి రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టలేక్ గాయ్ గాయ్ అవుతున్నారు. సీనియర్లని సముదాయించలేక కార్యకర్తల్ని నడిపించలేక సతమతమవుతున్నారు. వచ్చే ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు. ఈ సమయంలోనైనా కాంగ్రెస్ నేతలు కలువాలి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్ ని ,ఓటు బ్యాంకుని నిలబెట్టుకుని రేసులో ఉండాలి. ఏం జరుగుతుందో చూడాలి.