కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ.. వీడియో రిలీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ.. వీడియో రిలీజ్

August 13, 2022

కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు వీడియో రూపొందించి ట్విట్టర్‌లో విడుదల చేశారు. ‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోం గార్డ్ ప్రస్తావన, చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ పరుష వ్యాఖ్యలు చేయడంతో వెంకటరెడ్డి గారు ఎంతో మనస్థాపానికి గురయ్యారు. నన్ను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు నేను ఒప్పుకుంటున్నా. వెంకటరెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా. ఇలాంటి చర్యలు, భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడడం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మెన్ చిన్నారెడ్డి గారికి సూచన చేశా’నని వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా, వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే మునుగోడు ఎన్నిక ప్రచారానికి తాను వెళ్లనని, చండూరు సభకు తనకు ఆహ్వానం అందలేదని చెప్పుకొచ్చారు. అంతేకాక, రేవంత్ క్షమాపణలు చెప్పి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.