గ్లామరస్ ఎన్నికల అధికారి ఎవరంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

గ్లామరస్ ఎన్నికల అధికారి ఎవరంటే..

May 11, 2019

ఎన్నికల వేళ పసుపపచ్చ చీరలో గ్లామర్‌గా వున్న ఓ యువతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. మే 5న లక్నోకు 50 కిలోమీటర్ల దూరంలోని నగ్రామ్ 173 పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధికి హాజరవుతూ కెమెరాలకు చిక్కారు. గాగుల్స్ పెట్టుకుని, ఓ చేతిలో ఫోన్, మరో చేతిలో ఈవీఎమ్ పట్టుకుని.. మెడలో ఈసీ ఐడీ కార్డుతో మీడియా దృష్టిని ఆకర్షించింది. సినిమా హీరోయిన్‌కు ఏమాత్రం తక్కువలేదని.. అసలు ఈమేంటి ఎన్నికల అధికారిగా రావడమేంటి.. ఎలక్షన్ల కన్నా ఈమె సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుంది.. ఈమె బూత్‌లో వుంటే పోలింగ్ భారీగా నమోదు అవుతుందని.. ఇలా రకరకాల కామెంట్లు చేశారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అసలు ఆమె ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆమె ఎవరంటే..

Revealed: Details about the yellow saree lady Election Officer whose images have gone viral on social media

ఆమె పేరు రీనా ద్వివేది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి. PWD విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆమె అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అప్పుడు ఆమె ఫొటోలను చూసిన వారంతా ఆమె ఎవరన్నదానిమీద ఆసక్తి కనబరిచారు. తాను సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అవడంపై స్పందించారు రీనా..

‘ఒక్కరోజులో నేనింతగా దేశమంతా హైలైట్ అవడం చాలా సంతోషంగా వుంది. నన్ను చాలామంది ప్రత్యేకంగా చూస్తున్నారు. నేనేదో సెలెబ్రిటీని అయినట్టు నాతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో పాజిటివ్, నెగెటివ్ రెండు రకాల అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. వాటిని నేనిప్పుడు ఫేస్ చేస్తున్నా. ఫేమ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలింగ్ రోజు చాలా మంది వచ్చారు. మా పోలింగ్ బూత్‌లో 70 శాతం పోలింగ్ నమోదైంది’ అని రీనా ఆనందం వ్యక్తం చేశారు.