ఎలాంటి వైద్య సమస్యలు ఉన్నా గాంధీకి రండి... మంత్రి లక్ష్మారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఎలాంటి వైద్య సమస్యలు ఉన్నా గాంధీకి రండి… మంత్రి లక్ష్మారెడ్డి

August 10, 2017

గాంధీ హాస్పిటల్ ప్రెస్ మీట్ లో ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

గాంధీ ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి లోటుపాట్లు జరక్కుండా అన్నీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నాము. ఇప్పటికే 65 పడకల ఐసియు ని ప్రారంభించాము. అలాగే సిటీ స్క్యాన్ సెంట్రల్ లాబ్ కూడా ప్రారంభిస్తున్నాం. డబ్బుల్లేని బీద ప్రజలకు కార్పొరేట్ తరహాలో సేవలు అందిస్తున్నాము. రాష్టంలో అంతటా ఇన్ సెంటివ్, అధునాతన ఏర్పాట్లు చేసే ప్రణాళికలు చేస్తున్నాము. వైద్య రంగంలో ఎవరూ ఊహించని మార్పులను తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని, ఇంకా చాలా చేసేది ఉంది, తప్పకుండా అన్నీ చేస్తాము అని మాట్లాడారు.

లక్ష్మారెడ్డి మాట్లాడిన అనంతరం గవర్నర్ నరసింహన్ కూడా మాట్లాడుతూ.. తెలంగాణ వైద్య శాఖలో ఇవ్వాళ ఒక కొత్త రోజు అని అన్నారు. గత మూడేంళ్ల కిందట వచ్చిన వైద్య శాఖ పై నేను సీరియస్ అయ్యానని. ఇప్పుడన్నీ కొత్త పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చెయ్యాల్సిన పనులన్నీ చేసింది. ఇంకా ఉద్యోగుల భర్తీ కూడా చేస్తున్నాము. నేను కూడా ఇక్కడికే వైద్యం కోసం వస్తాను. ఇక నుంచి వైద్యుల భాద్యత…మంచి వైద్యం అందించాలి. ఎక్కడైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెయింటెనెన్సు చాలా ముఖ్యం. ప్రతి నెలా గాంధీ హాస్పిటల్ పై రివ్యూ నిర్వహించాలి. ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో సమస్యలు ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా పత్రికలు చూపిస్తున్నాయని తన ఆవేదన వ్యక్తం చేసారు.

అంతే గాకుండా రోగులు కూడా వైద్యులు, అధికారులతో సహకరించాలి. ప్రభుత్వం వచ్చి 38 నెలలు అయింది…మొదటి ఏడాది ఎలాంటి పరికరాలు లేవు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎలాంటి వైద్య సమస్యలు ఉన్నా గాంధీకి రండి.
ఆరోగ్యా తెలంగాణగా మారడానికి వైద్య శాఖ మంత్రి కృషి చేస్తున్నారని మాట్లాడారు.