రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఏమైనా జరిగితే, మా బాధ్యత కాదంటూ పరోక్షంగా బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘కేసీఆర్కు మందుచూపుంది కానీ ముందుచూపు లేదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వరి ధాన్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విదేశీ విహార యాత్రలు ముగించుకుని వచ్చిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. కాంగ్రెస్ చరిత్ర గురించి గాని, దేశ చరిత్ర గురించి గాని, తెలంగాణ ప్రజల గురించి గాని కేటీఆర్కు ఎలాంటి అవగాహన లేదు. డ్రామా రావు పుట్టింది ఆంధ్రాలో, చదివింది విదేశాల్లో ఆయనకు చాలా విషయాలు తెలీయవు’ అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో బుధవారం మీడియా ముందుకు వచ్చిన బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీ తీరుపై, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ”ఓట్ల కోసం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. త్వరలోనే చిప్పకూడు తినేందుకు రెడీగా ఉండండి. భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే, మా బాధ్యత కాదు” అంటూ పరోక్షంగా హెచ్చరించారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు.