కర్రసాము చేసిన రేవంత్ రెడ్డి..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కర్రసాము చేసిన రేవంత్ రెడ్డి..వీడియో వైరల్

May 18, 2022

తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి కర్రసాము చేశారు. పక్కన డీజే సౌండ్, తీన్మార్ మ్యూజిక్ కొడుతుండగా, ఆయన కర్రసాము చేశారు. స్థానికులు ఫోన్‌లో వీడియోలు తీస్తూ, తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందర ఆశ్చర్యానికి లోనై ఈలలు వేస్తున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి అన్న కొడుకు వివాహం కల్వకుర్తి పరిధిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రేవంత్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన రేవంత్ రెడ్డి పెళ్లిలో కర్రసాము చేయడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పుర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆయన క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇంత బిజీలో కూడా ఆయన పెళ్లికి హాజరై, కర్రసాము చేసి అభిమానులను ఉర్రూతలూగించారు.