RGV ANNOUCES TWO POLITCAL MOVIES
mictv telugu

ఎవరి వ్యూహం..ఎవరి శపథం…టార్గెట్ ఆ ఇద్దరేనా?

October 27, 2022

RGV ANNOUCES TWO POLITCAL MOVIES

ఏపీ సీఎం జగన్‌ని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బుధవారం కలిశారు. ఇద్దరు కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత మీడియాతో ఏం మాట్లాడకుండానే వర్మ వెళ్లిపోయారు.మరుసటి రోజే రాజకీయ సినిమా తీయబోతున్నానని ఇది బయోపిక్‌కు కంటే లోతైనదని ప్రకటించారు. అంతేకాదు సినిమా పేర్లను బయటపెట్టారు. ఎప్పుడూ సబ్జెక్ట్‌ని రీవిల్ చేయని వర్మ ఈసారి సినిమా పేర్లను చెప్పేశారు.రియల్ పిక్చర్..రియల్ స్టోరీ అంటూ తనదైన స్టయిల్ ట్విట్టర్లో వెల్లడించారు.వర్మ వ్యూహం ఎవరికోసం?శపథం చేసిందెవరు?రాజకీయ,అరాచకీయాలు చూపించబోయే వర్మ.. రచ్చకీయాలు ఎలా వుండబోతున్నాయి?

ఆ ఇద్దరేనా టార్గెట్

సూటిగా సుత్తి లేకుండా డైరెక్టర్ వర్మ వచ్చేశారు. రాజకీయాలపై రెండుపార్టుల్లో సినిమాలు తీయబోతున్నానని చెప్పారు. పార్ట్- 1 వ్యూహం,పార్ట్ -2 శపథం అని ప్రకటించేశారు. అంతే కాదు స్టోరీ లైన్ చెప్పేశారు. అహంకారం,ఆశయానికి మధ్య పోరాటమని వివరించారు. ఈ రెండింటి నుంచి పుట్టిందే వ్యూహం అని చెప్పారు. నూటికి నూరుపాళ్లు నిజాలుంటాయని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుందని, రాచకురుపుపై వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిభింబించేలా వ్యూహం సినిమా తీస్తానని క్లారిటీ ఇచ్చేశారు. జగన్‌ని కలిశాక ఈ సినిమాల్ని ప్రకటించారంటే వర్మ తీయబోయే సినిమా ఏపీ రాజకీయాలపైనేనని తెలిసిపోతుంది. చంద్రబాబు,పవన్ కల్యాణే విలన్లు క్యారెక్టర్లు.జగన్‌ ని హీరోగా చూపించేలా తీస్తానని వర్మ ఇన్ డెరెక్ట్‌గా చెబుతున్నారు.ఎందుకంటే వర్మ వాయిస్‌లో ఉన్న డైలాగులు జగన్ నోట తరచుగా వినిపిస్తుంటాయి.కాకపోతే సినిమా స్లైల్‌లో రాసుకున్నారంతే.

ఆయన కోసమేనా వర్మ వ్యూహం?

బయోపిక్ లు తీయడంలో రాంగోపాల్ వర్మ దిట్ట. సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యేదాకా కాంట్రవర్సీలు కామన్. ఈసారి కాంట్రవర్సీ లేకుండా ప్రకటించేశారు.గతంలో ఎన్టీఆర్,చంద్రబాబు,పవన్ కల్యాణ్ పై వర్మ సినిమాలు తీశారు. రచ్చ రచ్చకు కారణమాయ్యారు. వర్మకు కౌంటర్‌గా పీకే ఫ్యాన్ మూవీని వదలారు. బయోపిక్‌లో అబద్దాలుంటాయోమోగానీ ఈ సినిమాల్లో అంతా రియల్ అంటున్నారు వర్మ. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం మధ్య ఉద్భవించిందే వ్యూహం అంటున్నారు వర్మ .అంటే అహంకారం చంద్రబాబు,పవన్ కల్యాణ్ ది, ఆశయం జగన్‌ది అర్థం చేసుకునేలా వర్మ స్టోరీ లైన్ హింట్ ఇచ్చారు. పక్కాగా వ్యక్తులు, పార్టీల్ని టార్గెట్ చేస్తూనే సినిమా వుండబోతుందంటున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి కూడా ఇదే విషయం చెబుతున్నారు. రాజకీయాల్లో హత్యలు కాదు..ఆత్మహత్యలే వుంటాయన్న నానుడి వర్మ ప్రోత్సహిస్తున్న వారికి సరిగ్గా సరిపోతుందంటున్నారు.

ఎన్నికలకు ముందే వర్మ సినిమాలు

వ్యూహం, శపథం సినిమాలు రాబోయే ఎలక్షన్‌కు ముందే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఏపీ రాజకీయాల్సి మలుపుతిప్పేలా వుంటాయిని టాక్. అంతేకాదు జగన్‌కు మైలేజ్..చంద్రబాబు అండ్ కో పక్కా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారట. వర్మ మాటల్లో కూడా ఇదే స్పష్టమవుతోంది. ఫస్ట్ పార్ట్ “వ్యూహం” నుంచి కోలుకునేలోగానే…సెకండ్ పార్ట్ శపథం ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుందంటున్నారు.

ఈ షాక్‌లు ఎవరికి?

సినిమా అంటే 24 క్రాప్ట్స్. వర్మ మూవీ అంటే 24 వివాదాలు.ఇలా ట్వీట్స్ వదిలి అలా రచ్చలేపే వర్మ..ఏపీ రాజకీయాలపై రియాలిస్టిక్ సినిమాలు వదలబోతున్నారు.ఎన్ని వివాదాలు,,మరెన్ని మలుపులు తిప్పుతారో చూడాలి. లేదంటే తెగ హడావుడి చేసి సినిమాల్ని మమ అనిపిస్తారా?