నా పవర్ స్టార్ ఇతనే.. యాదృచ్చికం అంటూ(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

నా పవర్ స్టార్ ఇతనే.. యాదృచ్చికం అంటూ(వీడియో)

June 28, 2020

gngnvgngbdhbgc v

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్తగా తీస్తున్న ‘పవర్‌ స్టార్‌’ సినిమా గురించి  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి వర్మ మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘పవర్‌ స్టార్‌’లో టైటిల్ పాత్రధారికి సంబంధించిన ఓ వీడియోను  విడుదల చేశాడు. ‘నా కొత్త సినిమా పవర్‌ స్టార్‌లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం. ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కాని ఉద్ధేశ్యపూర్వకం’ అంటూ తన దైన శైలిలో ట్వీట్ చేశాడు వర్మ. ఈ వీడియోను చూసి పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. 

కాగా, ఇవాళ ఉదయం ఈ చిత్రం గురించి వర్మ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘ఈ సినిమాలో రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’ అని వెల్లడించిన విషయం తెలిసిందే.