వార్తల వేశ్య.. అర్నాబ్ గోస్వామిపై ఆర్జీవీ సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

వార్తల వేశ్య.. అర్నాబ్ గోస్వామిపై ఆర్జీవీ సినిమా

August 3, 2020

RGV announces new film titled 'Arnab The News Prostitute'.

‘కాదేది కవితకు అనర్హం’ అన్న శ్రీశ్రీ వచనాన్ని టాలీవుడ్ సంచలన, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తన సినిమాలకు మహ బాగా వాడేస్తున్నాడు. ‘కారెవరకు సినిమాకు అనర్హం’ అని భావిస్తున్నట్టున్నాడు వర్మ. వరుసగా లైమ్‌లైట్‌లో ఉన్నవాళ్లను, మలిగిపోయిన చరిత్రలకు తెర తర్పణం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ‘పవర్ స్టార్’ సినిమా తీసి ఎంత పెద్ద దూమారానికి తెరలేపాడో తెలిసిందే. తాజాగా మళ్లీ తన సంచలనాన్ని కొనసాగిస్తూ వర్మ మరో మాల్ మసాలా సినిమా రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి వర్మ ఫేమస్ యాంకర్ అర్నాబ్ గోస్వామి మీద తన సెటైరికల్ బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఈ సినిమాకు తనదైన శైలిలో టైటిల్ ప్రకటించాడు. ‘న్యూస్ ప్రాస్టిట్యూట్'(వార్తల వేశ్య) అనే టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. 

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని నెల రోజులు దాటిపోయింది. అయినా ఈ సంఘటనకు సంబంధించి ఏదో ఒక వార్త అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంటుంది. ఓవైపు కోర్టులు, కేసులు, పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు మీడియాలో దీని గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయమై జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి తన డిబేట్ షోలో పలు వ్యాఖ్యలు చేశాడు. వాటిపై స్పందించిన వర్మ వరుస ట్వీట్లు చేశాడు. ఈ క్రమంలో అర్నాబ్ మీదే సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్టున్నాడు వర్మ.. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రకటించాడు. చూడాలి మరి తనపై వస్తున్న సినిమాపై అర్నాబ్ గోస్వామి ఎలా స్పందిస్తాడో.