RGV Asks SS Rajamouli To beef-up-security filmmakers have formed assassination : Ram Gopal Varma
mictv telugu

రాజమౌళి సర్ మిమ్మల్ని చంపేయొచ్చు..సెక్యూరిటీ పెంచుకోండి..

January 24, 2023

RGV asks SS Rajamouli to beef up security, says bunch of filmmakers are planning to assassinate you

వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ తీసే సినిమాలకు ఎంత ఢిఫరెంట్‎గా ఉంటాయో.. అతడు చేసే ట్వీట్‌లు కూడా అదేరకంగా ఉంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అతడు..సినీ, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ దర్శకధీరుడు రాజమౌళిని ఉద్దేశించి ట్విట్టర్‌లో చేసిన కామెంట్స్ వైరల్‎గా మారాయి.

ప్రస్తుతం రాజమౌళి తీసిన సినిమా ఆర్ఆర్ఆర్ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఇటీవల సినిమాలోని నాటునాటు పాటకు ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డు రేసులో కూడా ఆర్ఆర్ఆర్ ఉండడం విశేషం. దీంతో రాజమౌళి క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరిగింది.

ఈ సమయంలో రాజమౌళిని ఉద్దేశించి ఆర్జీవీ ట్వీట్ చేశాడు. మొదటి ట్వీట్‌లో జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళిని మాట్లాడుతున్న వీడియోని జోడించి.. “మొఘల్ ఈ ఆజాం తీసినా కా ఆసిఫ్ నుంచి షోలే తీసిన రమేష్ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావ్…ఆదిత్య చోప్రాలు, కరణ్ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావ్..నీ కాలి బొటనవేలుని ముద్దాడాలని ఉంది” అని కామెంట్స్ పోస్ట్ చేశాడు.

మరో ట్వీట్‌లో “రాజమౌళి సర్ దయచేసి మీరు మీ భద్రతను పెంచుకోండి..ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా నీ మీద ద్వేషంతో రగిలిపోతున్నారు..వారంతా మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. అందులో నేను కూడా ఉన్నాను..కానీ నాకు నాలుగు రౌండ్లు పడే సరికి ఇలే చెప్పేశాను..అంటూ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్‎గా మారాయి.