RGV సంచలన ట్వీట్.. రఘురామకృష్ణ రాజుపై ఫీలింగ్స్ అంటూ - MicTv.in - Telugu News
mictv telugu

RGV సంచలన ట్వీట్.. రఘురామకృష్ణ రాజుపై ఫీలింగ్స్ అంటూ

July 1, 2020

hmhm

టాలీవుడ్ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలనం రేపాడు. ఏకంగా ఏపీ రాజకీయాల్లో మరోసారి వేలుపెట్టారు. ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీగా ముద్రపడిన నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తన ప్రేమను చాటుకున్నారు. ఆయనపై తనకు ఫీలింగ్స్ ఉన్నాయని చెబుతూ పోస్టు పెట్టడంతో వైరల్ అయింది. ఇప్పటికే వేడి రాజుకున్న ఏపీ రాజకీయాల్లో వర్మ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి.

రఘురామ కృష్ణ రాజును వర్మ తన ట్వీట్‌లో పొగడ్తలతో ముంచెత్తారు.  ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాకు కులపిచ్చి (రాజు) లేదు. కానీ ఖచ్చితంగా రఘురామకృష్ణం( రాజు ) ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ఓ గొప్ప నాయకుడు. అతను సింహం లాంటి వాడు. పులి లాంటి ధైర్యం ఉంది. సింహం సింగిల్‌గానే వస్తుంది. ఆయన నిజాయితీపరుడు’ అని పొగడ్తలు కురిపించాడు. రాజు కుల పిచ్చి లేదు కానీ రాజు పిచ్చి ఉందంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.