ఆయన పోస్టర్ చింపిండు..నువ్వు  బట్టలు చింపు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన పోస్టర్ చింపిండు..నువ్వు  బట్టలు చింపు..!

August 23, 2017

My request to Vijay Deverakonda is to tear off the clothes of Hanumanth Rao but my fear is children might get scared seeing HR like that

Posted by RGV on Tuesday, 22 August 2017

అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దు పోస్టర్ అసభ్యంగా ఉందని  కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంత్ రావ్ ఆర్టీసీ బస్సుపై ఉన్న ముద్దు పోస్టర్ ను చింపిన విషయం తెలిసిందే,దానిపై  చిల్ తాత… పోస్టర్ చూసే తట్టుకోలేకపోతున్నవ్ ,ఇగ రేపు సినిమా విడుదలైనంక ఎట్ల తట్టుకుంటవ్ తాత అని విహెచ్ పై  విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.అర్జున్ రెడ్డి ఆడియో ఫంక్షన్ లో విజయ్  బూతు మాట్లాడటమే కాదు ఆడియన్స్ తో కూడా అనిపించి హంగామా చేశిండు.

విహెచ్ పై రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు..

తాజాగా రాంగోపాల్ వర్మ  విహెచ్ పై ఘాటుగా స్పందించాడు.తాతయ్య వయసులో ఉండి ఈ పిల్ల చేష్టలేంది,అంత అందమై అమ్మాయి విజయ్ ని ముద్దుపెట్టుకుందని ఈర్ష్య పడుతున్నవా..లేకపోతే  అంత అందమైన అమ్మాయి నన్నెప్పుడు ముద్దు పెట్టుకోలేదు అని బాదలోంచి వచ్చిన కోపంతోని శింపేశ్నవా…కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ముసల్ధైపోయింది,మీరూ ముసలోల్లై పోయారు,వచ్చే ఎలక్షన్లల్ల  మీ ముసలోల్లకు ఇప్పటి మన్మలు,మన్మరాళ్లు ఎవ్వలు ఓటు వెయ్యరని వర్మ హనుమంత్ రావ్ పై విమర్శలు చేసారు.

అంతేకాదు  విజయ్ దేవరకొండకు సలహా ఇస్తూ  విజయ్ ఆయన నీ పోస్టర్ చింపిండు కదా,నువ్వు ఆయన బట్టలు చింపు…కానీ అప్పుడు బట్టలులేని హనుమంతురావ్ ను చూసి పిల్లలు నిజంగనే భయపడుతుండచ్చు..అని వర్మ అన్నారు.