దిశ ఎన్‌కౌంటర్ ట్రైలర్.. ఆనాటి ఘటన కళ్లకు కట్టినట్టుగా.. - MicTv.in - Telugu News
mictv telugu

దిశ ఎన్‌కౌంటర్ ట్రైలర్.. ఆనాటి ఘటన కళ్లకు కట్టినట్టుగా..

September 26, 2020

hmghm

దేశవ్యాప్తంగా గతేడాది సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య సంఘ‌ట‌న ఇంకా కళ్ల ముందు తిరుగుతూనే ఉంది. నలుగురు వ్యక్తులు మృగాళ్లుగా మారి ఆమెపై చేసిన దాడి, ఆ తర్వాత ఎన్‌కౌంటర్ అన్ని జరిగిపోయాయి. ఈ యదార్థ సంఘటన ఆధారంగా ఓ సినిమా తీస్తానంటూ అప్పట్లోనే  రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. దీనికి ‘దిశా ఎన్‌కౌంటర్’ పేరును కూడా ఖరారు చేశాడు. అన్నట్టుగా సినిమాను తెరకెక్కించి ట్రైలర్ విడుదల చేశారు. సరిగ్గా శనివారం ఉదయం 9.09 గంటలకు ఆయన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా బయటకు వదిలారు. 

ఈ ట్రైలర్‌లో సంఘటన జరిగిన తేదీని, సమయంతో సహా వెల్లడించాడు. దిశ హైదరాబాద్ వచ్చేందుకు టోల్ ప్లాజా దగ్గర లారీ పక్కనే తన స్కూటీని పార్క్ చేస్తుంది. దాన్ని గమనించిన నలుగురు దుండగులు గాలి తీసేస్తారు. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర ఆమెను కాల్చి వేయడం, సహా అన్ని కళ్లు కట్టినట్టుగా చూపించాడు. కాగా ఈ సినిమా నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.