స్క్రిప్ట్ లేకుండానే  తీశా !  - MicTv.in - Telugu News
mictv telugu

స్క్రిప్ట్ లేకుండానే  తీశా ! 

August 22, 2017

ఎప్పుడూ ఇతరుల మీద వివాదస్పద  సటైర్లు వేస్తూ వార్తల్లో ఉండే దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ. తాజాగా బాలీవుడ్ జర్నలిస్టు అనుపమా చోప్రాకు పెద్ద షాకే  ఇచ్చాడు. ‘అనుపమా ఫిల్మ్ కంపానియన్ ’ పేరుతో  వైబ్ సైట్ నిర్వహిస్తున్న అనుపమ.. వర్మను ఓ సాయం కోరింది.

వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీలు ‘సత్య’, ‘కంపెనీ’ స్క్రిప్టులను  తమకిస్తే తమ వెబ్ సైట్ లో పెడతామని ఆమె కోరారు. అవి సినీ రంగంలోకి కొత్తగా వచ్చేవారికి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. దీనిపై వర్మ స్పందిస్తూ.. ‘‘ఆ రెండు సినిమాలను స్క్రిప్ట్ లేకుండానే తీశాను.. అందుకే అవి హిట్ అయ్యాయి. ఎప్పుడైతే బౌండెడ్ స్క్రిప్ట్ తో సినిమాలు తీయడం మొదలుపెట్టానో అప్పటినుంచి నా సినిమాలు ఫ్లాప్ అవ్వడం మెదలయ్యాయి’’ అని చెప్పాడు. అనుపమను నమ్మించడానికి ఒట్లు కూడా పెట్టుకున్నాడు. తన తల్లి మీద, తనకు నచ్చిన డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్  మీద ఒట్టేసాడు. వర్మ చెప్పిన  జవాబుకు అనుపమ షాకైంది. ఇది వర్మ మార్కు క్లాసిక్ అంటూ సోషల్ మీడియా  పేజీలో పోస్ట్ చేసింది. దీని మీద నెటిజనులు చాలా రకాల కామెంట్లు చేశారు.

ఇప్పటి వరకు  విజయవంతమైన సినిమాలు పకడ్బందీ స్క్రిప్టు వల్లే హిట్టయ్యాయంటారు. అంతవరకెందుకూ.. వర్మ రోల్ మోడల్  స్టీపెన్ స్పీల్ బర్గ్ కూడా కేవలం స్క్రిప్టు పనుల మీదే ఆర్నెల్లు, ఏళ్లపాటు కూర్చునేవాడట. ఏ సినిమా అయినా ముందు పేపర్ మీదే వర్క్ అవుతుంది. అలాంటిది వర్మ ఇలా మాట్లాడటంతో చాలా మంది గందరగోళంలో పడ్డారు. వర్మను అలాగే వదిలేస్తే ‘నేను పుస్తకాలను చదువుకోకుండానే మేధావినయ్యా.. ’ అని కూడా అనేస్తాడేమో.