'భీమ్లా నాయక్'ట్రైలర్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

‘భీమ్లా నాయక్’ట్రైలర్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్

February 22, 2022

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథనాయకుడిగా, రానా ప్రతినాయకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రం ట్రైలర్‌పై, టైటిల్‌పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. “ఈ ట్రైలర్‌ను చూస్తుంటే రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కల్యాణ్‌ను ఉపయోగించుకున్నారని అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నా.ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ కాకుండా ‘డేనియల్ శేఖర్’ అనే టైటిల్ పెట్టాల్సి ఉండే” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

అంతేకాకుండా పవన్ కల్యాణ్ ట్రైలర్ అయితే, రానా పూర్తి సినిమా అని చెప్పారు. హిందీ ప్రేక్షకులకు పవన్ కల్యాణ్ కంటే ‘బాహుబలి’ సినిమా ద్వారా రానానే ఎక్కువగా తెలుసు. అందువల్ల ఈ చిత్రంలో రానా హీరో, పవన్ విలన్ అని హిందీ ప్రేక్షకులు పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కు అత్యంత సన్నిహితులైన మేకర్స్ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని ఆర్జీవీ కామెంట్స్ చేశారు.