రామ్‌గోపాల్ వర్మ డెన్.. మనస్తత్వానికి తగ్గట్టుగానే.. - MicTv.in - Telugu News
mictv telugu

రామ్‌గోపాల్ వర్మ డెన్.. మనస్తత్వానికి తగ్గట్టుగానే..

November 9, 2019

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన కోసం హైదరాబాద్‌లో ఏకంగా ఏ డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాల్లో చూపినట్టుగా డెన్ అంటే ఇదేదో డాన్‌లు సెటిల్‌మెంట్ల కోసం ఏర్పాటు చేసుకునే సామ్రాజ్యం కాదు. ఆర్జీవీ  ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న డెన్ కేవలం సినిమా ఆఫీసుగా వాడటం కోసం మాత్రమే. ఆ ఆఫీసును ఫొటో తీసి ఆర్జీవీ ముచ్చటగా డెన్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే ఈ ఆఫీసును కూడా నిర్మించారు. సైకిల్ చైన్, మధ్యలో గన్ ఉండేలా ఆఫీసు ముందు భాగాన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. 

Ram Gopal varma.

కాగా నాగార్జున హీరోగా తెరకెక్కిన గోవింద గోవింద సినిమా విషయంలో వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్జీవీ తన మకాం పూర్తిగా ముంబైకి మార్చేశాడు. అక్కడే ఆఫీసు ఓపెన్ చేసి తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే ఇటీవల కొంత కాలంగా ఏపీ పాలిటిక్స్ సంచలన కామెంట్లు చేస్తూ సినిమాలు తీయడం ప్రారంభించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ బయోపిక్ కూడా విడుదల చేశాడు. తాజాగా ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం ఆధారంగా  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పాటలు, ఫస్ట్ ‌లుక్‌లతో తరుచూ సంచలనంగా మారుతున్నారు. ఇక నుంచి ఆయన హైదరాబాద్‌లోనే ఆఫీసు ఏర్పాటు చేసుకొని సినిమాలు తీయాలని భావించారు. అందుకోసం తన అభిరుచికి తగ్గట్టుగానే ఆ ఓ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాడు. దాన్నే వర్మ తనదైన స్టైల్‌లో డెన్ అంటూ సంబోధించడం విశేషం.