మళ్ళీ కెలికాడు పవన్ ని - MicTv.in - Telugu News
mictv telugu

మళ్ళీ కెలికాడు పవన్ ని

July 3, 2017


రాంగోపాల్ వర్మ మళ్ళీ పవర్ స్టార్ మీద ట్విట్టర్లో వ్యంగ్యంగా విరుచుకు పడ్డాడు. ‘ నాకు పవర్ స్టారైనా – పోర్న్ స్టారైనా సేమ్ ఫీలింగ్ ’ అని ట్వీట్ చేసాడు. దీన్ని కాస్త త్రివిక్రమ్ డైలాగ్ కి కన్వర్ట్ చేస్కుంటే ‘ పవర్ స్టార్ డైలాగ్ కొడితే ఫ్యాన్స్ ఈలలు కొడతారు – పోర్న్ స్టార్ బట్టలు విప్పేస్తే ఫ్యాన్స్ వేడెక్కుతారు ’ వావ్.. ఇద్దరూ సమాజ సేవకులే.. ఒకరు ఎంటర్ టైన్ మెంటు – ఇంకొకరు రొమాంటిక్ మూడ్ పంచే వాళ్ళని వర్మ చాలా చక్కగా మామూలు సెటైరేసి చెప్పలేదనుకోండి.

మొదటి నుండి వర్మకి మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం కాబోలు. చిరంజీవి, నాగబాబు, రాంచరణ్, పవన్ కళ్యాణ్.., ఇలా ఎవ్వర్నీ ఫుజూల్గ వదిలి పెట్టే పాపాన పోలేదు వర్మ. ఇలా పవన్ ని ట్వట్టర్లో ఆడుకుంటే తనకు పాప్యులారిటి ఫుల్లుగా వస్తుందని ఫిక్సయినట్టున్నాడు . అందుకే ఇంత ఘాటు తాలింపు వేసాడు ట్విట్టర్ మూకుడులో. మరి పవన్ ఫ్యాన్స్ ఇంకా ఈ ట్వీట్ మీద స్పందించలేదేంటి అని ఆర్ జీవి ఫోన్ లో ట్విట్టర్ ను తెరుచుకొని పడిగాపులు పడుతూ కూర్చోవచ్చు. ఫ్యాన్స్ నుండి ఎన్ని తిట్లు వచ్చినా ఆహా.. ఓహో.. సమ్మగా వుంది.. మీరెంత తిడితే నాకంత పాప్యులారిటీ.. కమాన్.. కమాన్.. తిట్టండి నన్ను ఇంకా ఇంకా ఫేమస్ చెయ్యండని.. ఉగ్గబట్టి ఎదురుచూస్తున్నట్టున్నాడు వర్మ.

అయినా ఈ వర్మకి పనీపాటా ఏం లేదా ? ఎప్పడు చూసినా ఏదో ఒక నోటి దూలని సోషల్ మీడియాలో తీర్చుకుంటాడు. అవసరమా ఆయనకి ? గమ్మున మంచి సినిమాలు చేస్కోక ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి రక్కెయడమే వర్మ పనా ? లేక అతని హాబీయే అదా ? సినిమావాడు అయివుండి ఇంకొక సినిమా వాడి మీద ఇలా సెటైర్లు వెయ్యటం ఎంత వరకు కరెక్ట్ ? ‘ దయ్యం ’ వేదాలు వల్లించినట్టే వుంది వర్మ పరిస్థితి అని ఇప్పటికీ ఎందరో వర్మను విమర్శించినా, ముఖం పట్టుకొని ధూషించినా అతను మారడు.. ఎందుకంటే అతనింకా పాలుతాగే యాభై ఏళ్ల పసి పిల్లాడు కాబట్టి !? చూడాలి మరి ఫ్యాన్స్ సంగతి ఎలా వున్నా పవన్ రియాక్షన్ ఎలా వుంటుందో.. యాక్షనా ? సైలెంటా ?