కేసీఆర్.. ఇవాంకాకంటే అందగాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

 కేసీఆర్.. ఇవాంకాకంటే అందగాడు.. 

November 24, 2017

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా వాగ్బాణాలు సంధించారు. పెట్టుబళ్ల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా రానున్న నేపథ్యంలో.. కేసీఆర్, ఇవాంకాలపై ఘాటు సటైర్లు విసిరాడు.‘ఇవాంకాకు తాను అందగత్తెననే అహంకారం ఎక్కువ. అయితే, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి షాక్‌ అవ్వడం ఖాయం…’ అని ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు వర్మ.

మరో పోస్టులో.. ‘కేసీఆర్, ఇవాంక పక్కపక్కన కూర్చుంటే అప్పుడు ఇవాంకాను ఎవరూ చూడరని పందెం కడతాను.. ’ అని సవాల్ విసిరాడు.

ఇంకో పోస్టులో ఇవాంకాకు మూడు నంది అవార్డులు ఇవ్వాలన్నారు.  ‘ఇవాంకాకు ప్రపంచ అందగత్తెగా,  కుటుంబం మొత్తం చూడతగ్గ ఉత్తమ అందగత్తెగా, ఉత్తమ ప్రపంచ సుందరి నాయకురాలిగా.. మూడు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు ఇవ్వాలి’ అని వెటకరించాడు. ఇవాంకా లావుగా, అందవికారంగా ఉండుంటే ఇంత హంగామా చేసేవారా అని ప్రశ్నించారు.

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌పైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.

‘నేను పెద్దగా చదువుకోలేదు.. ఈ  సమ్మిట్‌ శాఖల గురించి అవగాహన లేదు.  కానీ, అధ్యక్షుడికి ప్రధాన సలహాదారుగా ఉంటే, ఆమెకు ఇవన్నీ అర్థమవుతాయనుకోవడం అవివేకం.. అయితే  ఈ సదస్సుకు హాజరయ్యే ఇతర నాయకులతో పోల్చుకుంటే ఆమె గొప్ప అందగత్తే’ అని అన్నాడు.

ఇవాంకా హైదరాబాద్‌లోని దోమల బెడద ఎక్కువగా ప్రాంతాల వారూ ఇవాంకా అక్కడ తిరగాలని పిటిషన్ వేయాలని సూచించారు. దీంతో దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.