కేసీఆర్ పై రాంగోపాల్ వర్మ రాతలు...! - MicTv.in - Telugu News
mictv telugu

 కేసీఆర్ పై రాంగోపాల్ వర్మ రాతలు…!

July 29, 2017

 

ఏ ఇష్యూ జరిగినా ఫేసుబుక్కుల్లో,ట్విట్టర్లో చాలా టిపికల్ గా స్పందిస్తారు వర్మ.అయితే తాజాగా వర్మ కేసీఆర్ గురించి తన ఫేసుబుక్కులో రాసుకచ్చారు. డ్రగ్స్‌ వాడుతున్న వారు కేవలం బాధితులన్న విషయాన్ని కేసీఆర్ సరిగ్గా అర్థం చేసున్నారు.ఆయన ఓ అద్భుతమైన, అందమైన నాయకుడని వర్మ రాసుకొచ్చారు.ఆయనలా ఆలోచించే విజన్ ఉన్న.. విచారణ బృందం అవసరమని పేర్కొన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ వ్యవహారంపై వర్మ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉన్నాడు. ఛార్మి సిట్‌ విచారణ అనంతరం ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయ్‌తో పోలుస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వర్మ.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇలా ప్రశంసించారు.