శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ

February 17, 2020

RGV.

టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉన్నట్టుండి శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యక్షం అయ్యారు. ఏసీపీని కలిసి దిశ  కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెపై అత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్‌కౌంటర్ జరిగిన వరకూ ఉన్న పరిస్థితులు కేసు వివరాలను ఏసీపీ వివరించారు. దిశ ఘటనపై ఓ సినిమా చేస్తానని ఈ మధ్య ప్రకటించిన నేపథ్యంలో ఆయన పోలీసులను కలడం ఆసక్తిగా మారింది. 

రాంగోపాల్ వర్మ ఇటీవల దిశ ఘటనపై స్పందించి అత్యాచారానికి పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల్లో ఒకడిగా ఉన్న చెన్నకేశవులు భార్యను కూడా తన ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సినిమా తీస్తానని కూడా ప్రకటించారు. దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి తాను శంషాబాద్‌ ఏసీపీని కలిసినట్టు వెల్లడించారు. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధనకు ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.