‘ఆర్జీవీ మిస్సింగ్‌’లో ప్రధాన నిందితులు వీరే.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్జీవీ మిస్సింగ్‌’లో ప్రధాన నిందితులు వీరే.. వర్మ

July 30, 2020

RGV Missing: All Set To Rake In Controversies

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో కాంట్రవర్సీకి తెరలేపాడు. తాజాగా తాను తెరకెక్కించబోయే సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఫిక్షనల్ రియాలిటీ (FR) అనే సినిమా తీయనున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాలో కూడా నిజ జీవితంలోని వారిని గుర్తు చేసే విధంగా పాత్రల పేర్లు పెట్టాడు వర్మ. ‘ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెడతారు. ఈ సినిమాలో పాత్రలు ఇవే ఉంటాయి. ప్రవన్ కళ్యాణ్, ఒమేగా స్టార్, సీబేఎన్, లాకేష్, WHY S జగన్, KCAR, KTAR. అలాగే ఇందులో పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారు. ఈ ఎఫ్‌ఆర్ సినిమా కోసం వేచి చూడండి’ అని ట్వీట్ చేశాడు.

మరోవైపు ఈ సినిమా కల్పితం కావచ్చు లేదా నిజం కూడా కావచ్చు లేదా వాస్తవాల ఆధారంగా ఉండవచ్చు అని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. వాస్తవికత కథనాల ఆధారంగా తీసుకోబడిన పాత్రలతో ఈ సినిమా సాగుతుందని చెప్తూ తన సినిమా కథ కూడా చెప్పాడు. ‘ఈ చిత్రంలో ఆర్జీవీ మిస్సింగ్ అని తెలిసిన అతని స్టాఫ్, పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. దీనిని పోలీసులు మొదట్లో డైరెక్టర్ పబ్లిసిటీ అని భావిస్తారు. కానీ ఆ తర్వాత నిజం అని తెలుస్తుంది. అయితే ఈ కేసులో నిందితులు ముగ్గురు… ఒకరు పవర్‌ఫుల్ స్టార్ అభిమానులు. రెండు ముంబై అండర్ వరల్డ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ. మూడు ఫ్యాక్షనిస్టుల సహాయం తీసుకునే ఒక మాజీ ముఖ్యమంత్రి, అతని కుమారుడు’ అని ఆర్జీవీ తెలిపాడు. కాగా, ఈ సినిమాలోని పాత్రల్లో కొన్ని పేర్లు వాడకంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘వర్మా నీ సంచలనాలు, వివాదాలు పీక్స్‌కు చేరుతున్నాయి. జాగ్రత్త’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంక నిన్ను ఎవరూ కాపాడలేరు’ అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.